12:13 AM
0


అమ్మ మనసు ....
మీ చిన్నప్పుడు అమ్మ రోజు తెల్లరిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాక ఏం అనేదో గుర్తు ఉందా??

చిన్నా!.. టైమయింది.. లే
స్కూల్ బస్సు వచ్చేస్తుంది..
మొహం కడుక్కో..
పళ్ళు తోముకో..
నా మాట వినరా కన్నా!!
టై మైపోతుందీ..
పక్క అలాగే వదిలేసావు..
ఇలా దా.. స్నానం చేద్దువ్ గానీ..
లేచావా!!
తలదువ్వనీ
బట్టలివిగో
బూట్లేసుకున్నావా!!
ఏరా అలా ఉన్నావే!..
ఒళ్ళెచ్చగా ఉందా..
హోంవర్క్ బుక్కు పెట్టుకున్నావా!!
చూసుకో అన్నీ ఉన్నాయో లేదో.. జాగ్రత్త..
బాక్సు నువ్వే తింటున్నావా!! ఏదీ వదలొద్దు.. అర్థమైందా!!

ఈవాళ గేమ్సున్నాయా!! షూస్ జాగ్రత్త
అవిఇవీ కలపకు.. నెమ్మదిగా తినూ.. నమలాలి.. అలా అని లేట్ చేయకు.. బస్సొచ్చేసింది..
జాగ్రత్త.. దేవుడికి దణ్ణం పెట్టుకున్నావా!!
పుస్తకాలు అలా పడేస్తావే!!
కాళ్ళు చేతులూ కడుకున్నావా.. ఆగూ..
పాలు తాగకుండా బయటకు వెళ్ళకు..
ఈ పాలు తాగు.. తొందరగా ఎదిగిపోతావ్.. బోల్డు బలమొచ్చెస్తుంది
మూతి తుడుచుకో.. కొద్దిగా పౌడర్ రాస్తానుండు..
బయటాడుకోరా.. ఎవరితోనూ దెబ్బలాడకు
మంచిగా ఉండాలి.. కిందే ఆడుకో.. రోడ్డు మీదకు వెళ్ళకు.. కుక్కలుంటాయ్ బాబోయ్
ఆరింటికల్లా.. ఇంట్లో ఉండాలి! లేకపోతే నేనే వస్తా నీ ఇష్టం మరి..
ఎన్నింటికి రమ్మంటే.. ఎన్నింటికి వస్తున్నావ్!!
నీ గది సర్దుకో.. ఇల్లు పాడు చేయకు.. ఈ పక్క పరు..
ఇప్పుడే చెయ్యాలి లేకపోతే.. టీచర్ తిడుతుంది.
ఏరా అడివిలో పుట్టావా నువ్వేమైనా!!
ఒక్క మాటైనా విన్నావా!! నీతో నేను మాట్లాడను..
ఫోనెత్తు,, సరిగ్గా పెట్టు.. టీవీకి అంత దగ్గరగా కూర్చోకు..
ఇలా తిరుగు.. ఇలా తిరగమంటుంటే….
అన్నం వలిగిపోతుంది..
ఆ గోడ మీద రాయకు ఓనర్ చూసాడంటే తిడతాడు..
రాత్రికి నీకు కంప్యూటర్ గేమ్ లేదంతే..
నా మాట వినకపోతే సెల్ ఫోన్ కూడా ఇవ్వను..
తీసుకున్నాక థాంక్స్ చెప్పాలి..
నువ్ పెద్దెదిగాకా కానీ నే చెప్పింది నీకర్థం కాదు..
నీకు పిల్లలు పుట్టేదాకా ఆగు..
అప్పుడనుకుంటావ్.. అమ్మ నిజం చెప్పిందని..
ఇదికొరుకు.. నమిలేటప్పుడు నోరు మూసుకోవాలి
నాతో మాట్లాడకు
నీ ప్లేట్లో పెట్టిందంతా తినెయ్యాలి.. వదలకూడదు
విసిగించకు.. గట్టిగా పట్టుకో
నేను మూడు లెక్కపెట్టేలోగా రావాలి.. లేదా..
నీ పని నువ్ చూసుకో..
నాకెందుకు!!.. నిన్నసల పట్టించుకోను ఇలా ఐతే..
నువ్ ఎంత పెద్దోడివైనా నా కొడుకువేరా..
తిన్నగా నడు
నిజం చెప్పు.. అమ్మ మీద ఒట్టేసి..
మీ ఫ్రెండ్స్ అంతా మేడ మీంచి దూకేస్తే.. నువ్వూ దూకేస్తావా!!
ఈ మాట నీకిప్పటికి వెయ్యి సార్లు చెప్పాను..
నువ్వు మీ నాన్న కొడుకువిరా.. అందుకే నా మాట వినవ్..
నీతోనే మాట్లాడుతుంది.. ఇలా చూడు..
ఎక్కడతీసింది అక్కడ పెట్టు..
ఊరికే ఏడవకు..పడుకో..
మీద కాలూ చెయ్యీ వేసేస్తే ఎలా.. గాలాడదు నాకు
దా బొజ్జోదణ్ణమెట్టుకున్నావా!!

అలసిపోయాడమ్మా..బిడ్డ..
వీడు నా బంగారు కొండ..
దిష్టి తియ్యాలి..

అమ్మ ప్రేమని ఎన్నడూ మర్చిపోవద్దు ...మీరు పెద్దవాలు అయ్యారు కాని అమ్మ కళ్ళు నిన్నే వెతుకుతాయి అని మర్చిపోకు ...అమ్మతో కాస్త సమయం గడుపు ప్రేమగా ...అమ్మకి ఇంతకన్నా ఏమి వద్దు ..నీ చిరునవ్వు అమ్మకి చాలు ...

మీ ..................***** http://telugupeopls.blogspot.in/*****

0 comments:

Post a Comment

Live Cricket

Archive