11:51 PM
0

ఒక తాగుబోతు భర్త పూర్తిగా తాగి యింటికి వచ్చాడు. వాడి భార్య అతడిని
సంతోషపెడదామని పూరీలు, బూరెలు, గారెలు చేసింది. భర్త రాగానే ఆ విషయమే చెప్పింది.
" వచ్చారా....నేను మీ కోసమే ఎదురుచూస్తున్నాను ?" అని తను చేసిన వాటి గురించి చెప్పాలనే సంతోషంతో అన్నది భార్య.
" రాకుండా పోతాననుకున్నావా " అని తూలుతూ అన్నాడు ఆ భర్త.
" మీ కోసం పూరీలు, బూరెలు, గారెలు చేశానండీ " అని సంబరంగా చెప్పింది భార్య.
" అవునా....పూరీలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.
" తినడానికి " అని మరింత సంబరంగా చెప్పింది భార్య.
" మరి బూరెలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.
" అవి కూడా తినడానికే " అని చెప్పింది భార్య.
" పూరీలు, బూరెలు తినడానికి చేశావు బాగానే వుంది. మరి గారెలు ఎందుకు చేశావు "
  అని అడిగాడు భర్త.
" అవి కూడా తినడానికేనండి " అని చెప్పింది భార్య.
" అన్ని తినడానికి చేస్తే...మరి నాకోసం అంటావేంటి " అని అక్కడి వెళ్ళిపోయాడు భర్త.
  ఏమి చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంది ఆ భార్య.

                                                     www.andhracultures.blogspot.in

 

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive