2:41 AM
0


అందమైన చుక్కల చీర కట్టి
హరివిల్లుల రవిక తొడిగి
నల్ల మబ్బు కాటుక పెట్టి
వెన్నెలంటి మల్లెలు జడను చుట్టి
చల్లని చంద్రుని గుండెలో దాచి
మండే సూరీడిని గుప్పిట మూసి
ఉదయపు కాంతులు బుగ్గన పూసి
సాయంత్రపు సింధూరధూళి నుదుటన దిద్ది
పకృతి రాగంతీస్తూ ఊహలవిహంగాల రెక్కలపై
విహరిస్తూ వెతుకుతున్నా నీ చిరునామా ...


                         http://telugupeopls.blogspot.in/

0 comments:

Post a Comment

Live Cricket

Archive