5:11 AM
0
అలలు లేని సముద్రం ఉండదు
కష్టాలు కన్నీరు భాదలు లేని జీవితం ఉండదు
తీరం చేరాలని ప్రతి అల ఆరాటపడుతుంది
ఆనందంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు
ఎగిసి పడే అలలతో సముద్రుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
ఆనందం వస్తే మనిషికి పట్ట పగ్గాలు ఉండవు
అన్ని అశాశ్వతం .... ఆక్షణమే ఆనందం
ఆనందం ...భాద రెండు మనలో నుండి వచ్చినవే
చీకటి వెలుగులు రెండు వుంటాయి
మన చూపు ఎటువైపు వుంటే అదే కనిపిస్తుంది
పయనించు వెలుగు రేఖల వైపు
నీ గమ్యాన్ని చేరడానికి
నీ లక్ష్యాలని చేదించడానికి
నీకు నీవే మార్గ దర్సుకుడివి
నీ జీవిత నౌక దిక్సూచి
నీ చేతిలోనే ఉంది.....
సరియిన మార్గం ఎంచుకుంటే
గమ్యం చేరడానికి అవగాహన ఉంటుంది
లేకపోతె ఎటో కొట్టుకుపోతావు
వెనక్కి రాలేనంతగా ......
అనాలోచిత నిర్ణయం
జీవితాన్నిమింగేస్తుంది
అలోచించి అడుగు వేస్తె
జీవితానికి అర్ధం కలిపిస్తుంది
నిన్ను నువ్వు తెలుసుకో
జీవించు నీ ముందు తరాల వారికి
ఆదర్సంగా ....
మిత్రులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు......!

Please visit my site all viewers: www.telugupeopls.blogspot

0 comments:

Post a Comment

Live Cricket

Archive