4:47 AM
0


జీవితం అంటేనే ఓ గొలుసుకట్టు అనుభవాల సమాహారం. ఈ క్షణం మనం ఆస్వాదించేదీ, కుంగదీసేదీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, భవిష్యత్‌లో పూర్తి విభిన్నమైన అనుభవాన్ని మిగల్చడానికి ఆదిబిందువు కావచ్చు. అన్నింటికీ మించి ఇప్పుడు తటస్థించిన అనుభవం ఏదైనా కావచ్చు, అది మనకు మాత్రమే మంచి జరిగింది, మనకు మాత్రమే చెడు జరిగింది అని నిర్థారణకు రావడం హాస్యాస్పదమే. మన ప్రమేయం లేకుండా గడిచిపోయే జీవితంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. మన పనిని చిత్తశుద్ధితో చేసుకుంటూ కర్మయోగిగా ముందుకు సాగాల్సిన వాళ్లమే తప్ప సంఘటనల వెనుక కార్యాకారణ సంబంధాలను అన్వేషించడానికి పూనుకుంటే ఏదో ఒక దశలో ఏ సంఘటన యొక్క ఆద్యంతమూ మనకు ఊహకు అందదు. అలా పూనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. సృష్టి లయబద్ధంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తూ తన ధర్మం పాటిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని క్షణాలు కొందరికి సంతోషదాయకమైనవి అయితే మరికొన్ని క్షణాలు మరికొందరికి నిరాశనే మిగుల్చుతాయి. ఈ క్షణం ఇలాగున్నంత మాత్రాన ప్రతీ క్షణమూ ఇలాగే ఉంటుందని నిర్థారణకు రావడం అపరిపక్వమైన ఆలోచనాసరళి! అలాగే ఏది ఎవరికి మంచో, ఎవరికి చెడో తెలుసుకోగలిగిన స్థూలదృష్టి మనకు లేనప్పుడు.. చిత్తశుద్ధిగా మనం చేసేదంతా మంచికే అనుకుని మౌనంగా పనిచేసుకువెళ్లడమే ఉత్తమం.
అందరికి నమస్కారములు……..!
మన పేజీ(www.telugupeopls.blogspot.in) మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి.. www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive