1:10 AM
0
ఎవరైనా ఒక అమ్మాయి కొత్తగా పెండ్లయి, అత్తవారింట్లో అడుగు పెడుతున్నప్పుడు, భయమూ,బెరుకు ఉండడం సహజం. అత్తవారింట్లో ఎలా మెలగాలో,ముఖ్యంగా అత్త మామల పట్ల, ఆడబిడ్డలు పట్ల ఎలా మసలుకోవాలో తల్లి తండ్రులు చెప్పి పంపుతారు. అయినా కొత్త చోట భర్తతో సహా అందరూ కొత్తవారే కాబట్టి బెరుకుతనం ఉండడం సహజం.మరి అటువంటి కొత్త కోడలు పట్ల మెట్టినీంటి వారు చూపాల్సింది ఏమిటి? సహజంగా తమ కుటుంబం కంటే గొప్ప కుటుంబం (అంతస్తులో) నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్న వారు, ఎక్కువ కట్నం తెచ్చిందని కావచ్చు, లేక తమకంటే ఆమే తల్లి తండ్రులు దనవంతులు అని కావచ్చు ఆమెను చాలా గౌరవంగా చూస్తారు. అదే ఇంటిలో తక్కువ  కట్నంతో వచ్చిన కోడల్ని కొంచం చిన్న చేసి చూస్తారు. దీని వలన సహజంగానే ఆ కోడళ్ల మద్య బేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కాని దన ప్రాప్తి అనేది కేవలం శక్తి సామార్ద్యాల మీదే కాక అద్రుష్తానుసారం కూడ కలుగుతుంది అని తెలిసిన వారెవ్వరూ, పిల్లల్ని వారి వారి హోదాలానుసారం ప్రేమించడం లేక గౌరవించడం చెయ్యరు. ఇది కుటుంబ విదానానికే గొడ్డలి పెట్టు. కోడళ్లని తమ కుటుంబ సబ్యులలో ఒకరుగా స్వీకరించాక ఆమే
ఆ ఇంటి దత్త పుత్రిక వంటిది. అందరి కుటుంబ సబ్యుల పట్ల ఎలా ప్రెమాభిమానాలు ప్రదర్సిస్తామో అలాగే ఆమెను చూడాలి. అలా కాకుండా గౌరవం చూపిస్తున్నాం అంటే అది ఖచ్చితంగా,వారు ఆమెను ఆ కుటుంబ సబ్యురాలిగా
స్వీకరించలేదనే అర్థం. ఒక కుటుంబంలో స్త్రిలకు లేదా ఏ ఇతర సబ్యులకైనా రక్షణ ఇచ్చేది ప్రేమాభిమానలే తప్పా, గౌరవ బావాలు కావు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబంలో పెద్దల పట్ల
పిన్నలు చూపే ప్రేమ గౌరవమర్యాద రూపంలో ఉండవచ్చు. అంత మాత్రాన అది ఇతరుల పట్ల చూపే గౌరవ
మర్యాదలు లాంటిది కాదు. తమ పెద్దలు పట్ల ప్రేమాభిమానాలు చూపే విదానం మాత్రమే. ఈ సూత్రం కొత్త
కోడళ్ల పట్ల కుటుంబంలోని పిన్నలు చూపే గౌరవ మర్యాదలకు వర్తిస్తుంది. కాబట్టి ప్రేమ అనే అంశంతొనే
కుటుంబ సబ్యుల బందాలు ఉంటాయి తప్పా అన్యదా కాదు.ఏ కుటుంలోనైనా కోడల్లను కాల్చిన అత్తలు ఉన్నారు కాని, ఎంత నీచురాలైనా కూతురుని కాల్చిన వారున్నారా? కారణం ప్రేమ! ఆ ప్రేమ అనేది కొత్త కోడలి పట్ల అత్తవారింట స్తాపితమయ్యేవరకు ఆమె పరాయిదిగానే ఉండి పోతుంది.

0 comments:

Post a Comment

Live Cricket

Archive