11:12 PM
0

జీవితం అమూల్యమైనది...

.
మనం కాలాన్ని అమూల్యమైనదిగా గుర్తించి,
క్షణం కూడా వ్యర్థంకాకుండా చూడాలి.
అనుక్షణం దైవాన్ని మనసులో నిలుపుకుని

పరోపకారం, దయాగుణం వంటివి అలవరుచుకోవాలి.
.
ఆరుగంటల నిద్రాసమయం తప్ప మిగిలిన కాలాన్ని
క్షణం కూడా వ్యర్థం చేయకూడదు. దానిని
దుర్వినియోగం చేయడం కూడా మంచిది కాదు.
మానవజీవితం అమూల్యమైనది. కాబట్టి మనం ఒక
క్షణం కూడా సోమరితనానికి తావీయకూడదు.
.
ఏది మంచి పని అని తోస్తే దానిని
అనుసరిస్తూ ఉండాలి.
క్షణకాలపు దుస్సాంగత్యమైనా మానవునికి తీరని
అనర్థాన్ని కలిగిస్తుందనే విషయాన్ని దృష్టిలో
ఉంచుకోవాలి.
.
ప్రమత్తత, సోమరితనం, నిద్ర, భయం, ఉద్వేగం,
రాగద్వేషాలు, అహంకారం,
దురభ్యాసాలవంటి అవలక్షణాలను వదలి
మనం మనజీవితాన్ని వివేకం, వైరాగ్యం, త్యాగం,
సంయమనం, నిష్కామభావం వంటి ఉత్తమ
లక్షణాలను అవలంబించి
ప్రాణులన్నిటీని పరమాత్మ స్వరూపాలుగా భావించి
ఆసక్తిని, అహంకారాన్ని వర్జించి వారికి
హృదయపూర్వకంగా సేవలు చేస్తుండాలి.

.
ప్రతి ఒకరియందూ సమభావన, అవ్యాజప్రేమ, దయ
కలిగివుండాలి.
www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive