4:45 AM
2
* 4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి- తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా
ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.
* ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి
ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు .
* కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లైఅధికం గా ఉంటాయి ,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి .
* పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .
* పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సియం శాతం ఎక్కువ . కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.
* విటమిన్ బి , పాస్ఫరస్ , పొటాసియం , మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి .
* పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది .
* పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర , కరివేపాకు , చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి , డయేరియా తగ్గును .
* పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది .
* పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గును కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే
భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు.క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం.
* పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.
* రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు..శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి.
* అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే
పెరుగు వాడకాన్ని పెంచండి.

 

2 comments:

  1. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సరైనదేనా అండీ ? అనుమానం తో అడగటం లేదు . నిర్థారించుకునెన్దుకు అడుగుతున్నాను . పెరుగు తినటం వల్ల ఒళ్ళు వస్తుందని చాలామంది దగ్గర విన్నాను . మీరేమో కొలెస్ట్రాల్ తగ్గి సన్న బడతారంటున్నారు .. మీ సూచన కనుక సరైనదే అయితే ఇది చాల మందికి మంచి సలహా అవుతుంది . అందుకే అడుగుతున్నాను

    ReplyDelete
    Replies
    1. రాధిక గారు నేను ప్రయత్నించిన తరువాతనే చెప్తున్నామండి.మీరు ఎవరి చేతనైన ప్రయత్నించి చూడండి.పడుకునే ముందు గ్లాసు నీరు త్రాగటం మరచి పోవద్దు....

      Delete

Live Cricket

Archive