4:35 AM
0

తల్లి తండ్రుల మీద దయలేని పిల్లలు ...

మనకు జన్మనిచ్చిన జన్మదాతలు వారు. మనల్ని పెంచి పోషించి మన ఉన్నతి కోసం నిరంతరము తపించిన ఔదార్యమూర్తులు వారు. మనం బాదపడుతుంటె తల్లడిల్లిపోయిన కారుణ్యమూర్తులు వారు. వారికి చదువు లేకపోయిన మన చదువుల కోసం మన పుస్తకాలు మోసి , మనల్ని ప్రయోజకుల్ని చెసిన వయోజనులు వారు . మన కోసమ్ ఉన్న ఊళ్లో ఆస్తులు తాకట్టు పెట్టి మన భవిష్యత్తు కోసం బంగారు భాటలు వేసిన శ్రామికులు వారు. వారే మన తల్లి తండ్రులు.

అటువంటి తల్లి తండ్రులును వ్రుద్దాప్యంలో తగిన గౌరవ ,సౌకర్యాలతో చూడవలసిన బాద్యత పిల్లల మీద లేదా? ఈ మద్య నా మిత్రుడు ఒకరి గురించి చెప్పాడు. తన మిత్రుదు ఒకాయనకి బార్య,ఇద్దరు పిల్లలు,తల్లి తండ్రి ఉన్నారంట . అయన బాగా స్తితిమంతుడంట. తనకి ఒక కారు, బార్యకి ఒకటి, అలాగే పిల్లలు ఇద్దరికి చెరొకటి. ఇన్ని ఉన్న ఆయనకు బార్య మీద అదుపు లేదు. అమేని మెప్పించటం కోసం తన ఆ స్తితి కి కారకులైన తల్లి తంద్రుల ఆలన పాలన చూడకుండ వారు లేకుండ ఉంటే బాగుండు ,వారి వల్లనే తనకి సుకం లేకుండా పోయిందని నా మిత్రుడు ముందు వాపోయాడట. నిజానికి అంత గొప్ప ఆస్తిపరుడుకి, తల్లి తంద్రుల బాగోగులు చూడడం కష్టమా? ఒకవేళ తన బార్యకి,తల్లితంద్రులకు పడకపోతే వెరే నివాసం ఏర్పాటు చేసి ఐన వాళ్లను చూడవచ్చు. తగిన పనివాళ్లను నియమించి వారికి బాదలు లేకుండ చూడవచ్చు. అంతే కాని వారు లేకుండా పోవాలనుకోవడం అమానుషత్వం.

కొంత మందిని చూస్తుంటాము. ఇంట్లో తల్లి తండ్రులని నిర్లక్షం చేస్తూ, దేవుళ్లకు మాత్రం లక్షలు,లక్షలు దానాలు చేసి పేపర్లలో మీడియాలలో ప్రచారం చేసుకుంటు ఉంటారు. పాపం వీరు చేసే దానాలను భగవంతుడు స్వీకరిస్తాడని వీరి నమ్మకం కాబోలు. సాక్షాతు ఇలవేల్పులైన తల్లి తండ్రులను కానని వారికి, ఆ భగవంతుని కటాక్షం, లక్ష కోట్లు దానం చేసిన దొరకదు. ఇటువంటి వారి గురించి మహాకవి వేమన చెప్పిన దేమిటంటే,

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు,

వాడు పుట్టినేమి,గిట్టినేమి.

పుట్టలోని చెదలు పుట్టవా! గిట్టవా!

విశ్వదాభి రామ! వినుర వేమ!

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive