5:14 AM
0

పదిమంది ఆనందానికి నువ్వు కారణం కాకపోయినా పరవాలేదు ఏ ఒక్కరి కన్నీళ్ళకి కారణం అవ్వద్దు.

స్నేహం అనేది అవసరాలు తీర్చే వస్తువు కాదు ఆనందాలు పంచే కమ్మని బంధం కష్టాలలో తోడు నిలిచి,కన్నీరు తుడిచేది మధుర జ్ఞాపకాలు అందించేది ఈ స్నేహం...

నిజానికి మించిన మిత్రుడు అబద్దానికి మించిన శత్రువు మనకు ఇంకొకరు లేరు. 

ఎందుకు మనకి ఈ కోట్లు,నోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కలని ఇస్తాయి తప్ప మన కోసం కనీసం రెండు కన్నీటి చుక్కలని కూడా రాల్చలేవు.కోటి రూపాయలు ముక్యం కాదు ...మన చుట్టూ మనకంటూ నలుగురిని సంపదిన్చుకోడం ముక్యం ...

సుఖంగా బ్రతకాలన్న స్వార్ధం కోసం మంచి అనేదాన్ని మనస్సులోనే సమాధి చెయ్యకు. 

ఒకరి బాధ చూసి ఆనందపడకు.
ఒకరి సంతోషాన్ని చూసి ఆసూయపడకు.
రెండిటి చేత నష్టపోయెది "నీ మనశ్శాంతి" 

"ఏ రోజైతే నిన్ను ప్రేమించే వ్యక్తి నమ్మకాన్ని పోగొడతావో
ఆ రోజుతో అ వ్యక్తి ప్రేమను,ప్రాణాన్ని హత్యా చేసిన వాడవుతావు" 

సమస్యలను ఎలాగైనా సరే ఎదిరించి పోరాడి జయించేవారు "సమర్దులైతే "
వాటిని విమర్శిస్తూ జీవించేవారు "అసమర్ధులు" 

నా మిత్రుడు నాకు చెప్పిన ఒక్క మంచి మాట ఇది ...
ఏ క్షణం నుండి నీ జీవితాన్ని నువ్వు ద్వేషిస్తావో,
ఆ క్షణం నుండి నరకం నీదవుతుంది.
ఏ క్షణం నుండి నీ జీవితాన్ని ప్రేమిస్తావో,
ఆ క్షణం నుండి స్వర్గం నీదవుతుంది.

 

తెలియక తప్పు చేసిన వారిని క్షమించు కాని...
తెలిసి మోసం చేసినవారిని క్షమించకు......

                                                         www.telugupeopls.blogspot.in

 

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive