4:22 AM
0


రామాయణ, మహ భారత, భాగవతాధీ గ్రందాలను మనం చదవకపోవడమే కాదు ,ఇతరులు ఎవరు అయినా చదివితే వారిని పరిహరించే స్తితికి దిగాజారిపోయాము , ఓ రైల్వే స్టేషన్ లో నూతన వధూవరులు , రైలు కోసం నిరీక్షిస్తున్నారు , వారి ప్రక్కనే కూర్చున్న వృద్దుడు రామాయణం చదువుతున్నాడు, కొత్త పెళ్లి కొడుకు రామాయణం చదువుతున్న వృద్దుడిని చూసి చదవడానికి మీకి పాత చింతకాయ పచ్చడి తప్ప ఇంకేమి దొరకలేదా? అని ఎగతాళి చేసాడు, ఆ వృద్దుడు అతడి వైపు చూసి.ఓ చిరునవ్వు నవ్వి మళ్ళి రామాయణం రసాస్వాదనలో నిమగ్నమయ్యారు, ఇంతలో రైలు బండి వచ్చింది, జనంతో క్రిక్కిరిసిన రైలుబండిలోనికి వృద్దుడు కష్టపడి వెళ్ళాడు ,ఆ యువకుడు కుడా పద్మ వ్యూహాన్ని చేదిన్చినంతగా శ్రమించి ,ముందుగా రైలు బండిలోకి సామానులు అన్ని ఎక్కించి ,తనుకూడా ఎక్కాడు , ఇంతలో రైలు కదిలింది , అతడి భార్య మాత్రం ప్లాట్ ఫారం పైన ఉండిపోయింది , సామాన్లను ఎక్కించే హడావిడిలో భార్య సంగతే మర్చిపోయాడు ఆ యువకుడు , అతడి ఆర్తనాదాలు విని ఆ వృద్దుడు రైలు బండి గొలుసు లాగి రైలు ఆపాడు , ఆ వధువు రైలు ఎక్కింది , అప్పుడు వృద్దుడు, ఆ యువకుడితో చూడు నాయనా నువ్వు రామాయణం చదివి వుంటే నీకి అవస్త కలిగి ఉండేది కాదు,అని చెప్పాడు , అంటే ఏమిటో అర్ధం కాస్త వివరంగా చెప్పండి,అని అడిగాడు ఆ యువకుడు , శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఒకసారి నదిని దాటవలసి వచ్చింది,అప్పుడు శ్రీరాముడు మొదట సీతాదేవిని పడవ ఎక్కించాడు, ఆ తరువాతనే రామలక్ష్మణులు ఎక్కారు, ఈ విషయం నీకు తెలిసి ఉంటె ముందు నీ భార్యని రైలు ఎక్కించి ఉండేవారు , భర్త అంటే భార్య సంరక్షణ ,సౌకర్యాలు పట్ల భాద్యత వహించేవాడు అని అర్ధం , అని వివరించాడు వృద్దుడు .


అలాగే అర్ధాంగి అంటే భర్త అష్ట ఐశ్వర్యాలలో తులతుగుతున్నప్పుడు ,కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతున్నప్పుడు అతని సాంగత్యాన్ని ఆశించటం, సిరి సంపదలు అన్ని కోల్పోయి కష్టాల పాలైనప్పుడు భర్తను విస్మరించటం కాదు, భర్త సుఖాలను పంచుకున్నట్టే కష్టాలను సమానంగా భరించగలిగే భార్యే నిజమైన అర్ధాంగి, అందుకు సంపూర్ణ నిర్వచనం సీతమ్మ జీవితం, శ్రీరాముడు అయోధ్యను విడిచి అరణ్యవాసానికి బయలు దేరుతున్నప్పుడు సీతాదేవిని అంతపురంలోనే ఉండమని కోరాడు, అప్పుడు పాటి సాహచర్యం లేని అయోధ్య అరణ్యంతో సమానమని పతి సన్నిధిలో ఉంటూ కందములాలను స్వీకరించినా అవి అరుతతుల్యమేనని ,కంటకాలతో కూడిన అరణ్య మార్గమైన పూల బాటే అని శ్రీరాముడు ని ఒప్పించి అరణ్యానికి పయనమైన ఆదర్శ అర్ధాంగి సీతామాత,అందుకే భారత దేశంలోనే కాదు ,ప్రపంచ చరిత్రలోనే సీతాదేవి లాంటి సాద్విమని మనకు కనిపించరు ,దుస్సహనమైన కష్టాలను సైతం భరించిన సహనశిలి , అని సీతాదేవిని స్వామీ వివేకానంద కీర్తించారు….
అందరికి నమస్కారములు…….!
మన పేజీ(www.telugupeopls.blogspot.in) మరింత ముందుకు పోవాలంటే మన పేజీ గురించి దయచేసి మీ తోటివారికి తెలియచేయగలరు (లైక్ చెయ్యమని చెప్పగలరు) .. మీకోసం ఇంకా చాలా చాలా మంచి పోస్టింగ్స్ వేచివున్నాయి.. www.telugupeopls.blogspot.in

0 comments:

Post a Comment

Live Cricket

Archive