5:41 AM
0


కొడుకుని పొగొట్టుకున్న శివ భక్తుని వేదనా........!


రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా !
నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మ దేవా తండ్రి మనసేమిటో నీవు ఎరుగవురా
తెలిసుంటే చెట్తంత నా బిడ్డని తిరిగి తెచ్చియగలవా నీ మహిమతో......!!
                                                                                                        ll రాతిll
పూవులో పూవునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను!
ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కునీవైమొక్క నీ మాట  విన్నాను
నాకన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైంది రా శంకరా
నీ సతికి గల పతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా……….!!
                                                                                                        ll రాతిll
శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీపమారనీక పడిగాపులున్నాను !
కళ్ళలో వేకువ దీవెననుకున్నాను కడుపులో ప్రేగును కోస్తావనుకోలేదు,
నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టదురా శంకరా  
ఎందుకని రాశావు ఈ రాతను పూలు రాలిన చెట్టులా ఈ జన్మను………!!
                                                                                                       ll రాతిll 

ఆడ జన్మలో ఉన్న అర్ధాన్ని వెతికింది అమ్మా అమ్మా అని పిలిపుకై అల్లాడిపోఇంది
చిన నోట తొలిసారిగా అమ్మా అని పలికితే ఆడ జన్మను నేను పెంచాను అనుకుంది


పురిటి నెప్పుల బాధ ఈశ్వరా నీ పార్వతిని అడగరా శంకరా

తల్లిగా పార్వతికి ఒక నీతి నా  ఈ తల్లి గుండెల్లో చితి మంటనా…….!!


                                                                                                       ll రాతిll 
                                           

రాతి బొమ్మలలోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా !
నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మ దేవా తండ్రి మనసేమిటో నీవు ఎరుగవురా
తెలిసుంటే చెట్తంత నా బిడ్డని తిరిగి తెచ్చియగలవా నీ మహిమతో......!!



                                                                                               

                                                                                                         

0 comments:

Post a Comment

Live Cricket

Archive