11:30 PM
0

వివాహంలో ప్రత్యేకమైన "జీలకర్ర బెల్లం" విశిష్టత ఏమిటో తెలుసుకుందామా..?

వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడటాన్ని సమీక్షణం లేక నిరీక్షణం అంటారు.
కళ్యాణవేదిపైన వధువు తూర్పు ముఖంగా, వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటారు. వీరిద్దరి మధ్యగా తెల్లని తెరను ఉంచుతారు. వధూవరుల చేతిలో జీలకర్ర బెల్లం మెత్తటిపొడిగా నలిపి ఉండగా చేసి సిద్ధంగా ఉంచుతారు. సకల మంగళవాద్యాలు మోగుతూ ఉండగా, ముత్తైదువులు మంగళములైన గీతాలను ఆలపిస్తుండగా, వేదఘోషల మధ్య శుభ ముహూర్తసమయంలో తెరను తొలగిస్తారు.
అప్పుడు వరుడు తన ఇష్ట దేవతను ధ్యానిస్తూ వధువు కనుబొమ్మల మధ్యభాగాన్ని చూస్తాడు. జీలకఱ్ఱ బెల్లాని ఆమె నడినెత్తిన బ్రహ్మరంధ్రముపైన ఉంచుతాడు. అలాగే, వధువు కూడా తన ఇష్టదేవతా ధ్యానంతో పెండ్లికొడుకు కనుబొమ్మల మధ్య చూసి అతడి నడినెత్తిన జీలకఱ్ఱ ముద్దను ఉంచుతుంది.
జీలకఱ్ఱ - బెల్లం :ఈ రెండిటి కలయిక వలన కొత్త శక్తి పుడుతుంది. నడినెత్తిన బ్రహ్మరంధ్రంపైన ఆ ముద్దను పెట్టిన తరువాత వధూవరులకు ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. వైజ్ఞానికులు కూడా సైన్సు పరంగా ఈ విషయాన్ని అంగీకరించారు. శుభమైన లక్షణాలలో కలిసిన అనురాగమయమైన
ఆ మొదటి దృష్టి వారి మధ్య మానసిక బంధాన్ని క్షణక్షణానికి పెంచుతుంది.

                                                  www.telugupeopls.blogspot.in

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive