12:37 AM
0

ఎన్నో ఆశలతో , ఎన్నో కోరికలతో అందమైన జీవితాన్ని గడపాలని ఆశపడ్డాను ...!!

కానీ ..!! చుట్టూ ఉన్న సమస్యలవల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ...!

కాలమే కాలనాగై కాటేస్తుంది
ప్రాణమే పడగ విప్పి పగపడుతుంది
ఆశే నిరాశై అంతమైపోతుంది
ఆనందం ఆవిరై ఇంకిపోతుంది
నవ్వు నరకమై చిత్రవాధ చేస్తుంది

ప్రాణం ఉన్నా బ్రతకాలన్న ఆశ మాత్రం లేదు
శ్వాస ఉన్నా శ్వాసించాలనే ధ్యాస లేదు
ఆవేదనకు అంతం లేకుండా పోతుంది
బాధలు బంధనాలై బందీనీ చేస్తున్నాయి
ప్రేమ పాశమై పీడిస్తుంది

మనసు ఆవేదనతో రగిలిపోతుంది..!!
మనిషిని గా ఉన్నా మాటలురాని శిలగా మారి మౌన సామ్రాజ్యాన్ని చేరుతున్నా...!!
మౌనాన్నే ఆభరణంగా ధరించి(పైకి ) మురిసిపోతున్నా , లోలోపల మధనపడుతున్నా..ఓ ప్రియ మిత్రమా.......!

                                                             www.telugupeopls.blogspot.in

 

0 comments:

Post a Comment

Live Cricket

Archive